టీఆర్ఎస్ లీడర్ వేధింపులు.. తాళలేక అతని భార్య ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: టీఆర్ఎస్ యువనాయకుడి వేధింపులు తాళలేక అతని భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం మన్సురాబాద్ డివిజన్ కు చెందిన జక్కిడి రఘువీర్ రెడ్డి టీర్ఎస్ పార్టీలో యువజన విభాగం నాయకుడిగా ఉన్నారు. వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. స్థానిక ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు. రఘువీర్ రెడ్డికి రెండేళ్ల క్రితం శ్రావ్య అనే యువతితో వివాహం జరిగింది. అంతకు ముందే ఓ యువతితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న రఘువీర్ రెడ్డి, భార్య శ్రావ్యను పట్టించుకోకుండా అదనపు వరకట్నం తీసుకురావాలని, మానసికంగా, శారీరకంగా కుటుంబ సభ్యులతో కలిసి వేధించసాగాడని అతని భార్య పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధితురాలు శ్రావ్య ఇంట్లోని విష రసాయనాలు తాగింది. సమాచారం అందుకున్న ఆమె సోదరుడు, కుటుంబ సభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందే భార్య శ్రావ్యకు గర్భం రావడంతో రఘువీర్ రెడ్డి బలవంతంగా అబార్షన్ చేయించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పింది. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో కూడా రఘువీర్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ప్రస్తుతం రఘువీర్ పరారీలో ఉన్నట్లు ఏ‌సి‌పి శ్రీధర్ రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు.

ఇవీ చదవండి

విమానాల్లో తిరిగే ప్రముఖులే ఆ సింగర్ టార్గెట్.. తర్వాత ఏం చేస్తుందంటే

వాట్సప్ కొత్త పాలసీతో ఊపందుకున్నసిగ్నల్, టెలిగ్రామ్

బ్రౌన్‌ రైస్‌.. వైట్‌రైస్‌ ఏది మంచిది?

పాస్‌వర్డ్ మర్చిపోయిండు.. గుర్తురాకపోతే రూ.1,600 కోట్లు హుష్

Latest Updates