రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ నేతలు

జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ బహిరంగ సభలోనే కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కొందరు నాయకులు ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

కూకట్ పల్లి టీఆర్ఎస్ నాయకులు గొట్టిముక్కల పద్మారావు, కొలను హనుమంత్ రెడ్డిలను రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.

2014 లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో TRS అభ్యర్తిగా పోటీ చేశారు కొలను హనుమంతు రెడ్డి. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి కేపీ వివేకానంద చేతిలో ఓడిపోయారు. తర్వాత కాలంలో వివేకానంద టీఆర్ఎస్ లో చేరారు. ఇపుడు కొలను ..కాంగ్రెస్ లో చేరారు.

గొట్టిముక్కల పద్మారావు 2014 లో కూకట్ పల్లి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలిచారు. ఎమ్మెల్యే కృష్ణారావు ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్ లో చేరారు. ఇపుడు గొట్టిముక్కల టీఆర్ఎస్ ను వీడారు.

Latest Updates