వరద బాధితులతో TRS నేతలు సొమ్ము చేసుకుంటున్నారు: రాజాసింగ్

వరదల కారణంగా హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నేతలు సొమ్ముచేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గ్రేటర్ హైదరాబాద్  మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు TRS పార్టీ నేతలను వెంటపెట్టుకొని డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. వరదలతో ఇబ్బందులు పడ్డ వారికి కాకుండా TRS కార్యకర్తలకు 10 వేల రూపాయలు ఇస్తున్నారన్నారు. టీఆరెస్ నేతలు బాధితులతో భేరం ఆడుకుంటున్నారన్న రాజాసింగ్..10 వేలు ఇప్పించి రూ. 5వేలను టీఆర్ ఎస్ కార్యకర్తలు తీసుకోవడానికి ఒప్పందం చేసుకుంటున్నారన్నారు.

Latest Updates