ర్యాలీ కోసం గ్రామ పంచాయతీల ట్రాక్టర్లను వాడిన నేతలు

కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ.. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పిలుపుతో.. కార్యకర్తలు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి వివిధ ప్రాంతాలకు చెందిన రైతులతోపాటు.. దినసరి కూలీలను తరలించారు. ర్యాలీలో పాల్గొన్న చాలా మంది.. కొత్త రెవెన్యూ చట్టం గురించి తమకేమీ తెలియదన్నారు. డబ్బులిస్తామంటే ర్యాలీలో పాల్గొన్నామని చెప్పారు. ఇక ర్యాలీ కోసం గ్రామ పంచాయతీల ట్రాక్టర్లను ఉపయోగించారు నేతలు. ప్రభుత్వ పథకాల కోసం వినియోగించే వాహనాలను.. ర్యాలీకి తీసుకురావటంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడిన పంచాయతీ సిబ్బందిపై.. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.

Latest Updates