దుబ్బాక ఎన్నిక చరిత్రాత్మకమైనది

దుబ్బాక ఉప ఎన్నిక చరిత్రాత్మకమైనదని.. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉపఎన్నికలో గెలిచేందుకు పార్టీ శ్రేణులు విభేదాలను పక్కనపెట్టి, ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించామని… పోటీ చేయబోయే అభ్యర్థిని త్వరలోనే ఎంపిక చేస్తామని చెప్పారు. మండల కమిటీలను మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షులను ఆదేశించామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని… దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని చెప్పారు ఉత్తమ్.

Latest Updates