అట్లయితే టీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చేదే కాదు

లోక్​సభ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగివుంటే టీఆర్ ఎస్ కు మెజారిటీ వచ్చేదికాదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌‌‌‌ జవదేకర్ అన్నారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు కుటుంబీకులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఓడించి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామన్న నేతలను, పార్టీలను ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారంటూ టీడీపీని ఉద్దేశించి కామెంట్ చేశారు. బీజేపీతో పొత్తువల్లే 2014 లో టీడీపీ గెలిచిందన్నారు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయటంతోపాటు మోడీని దూషించటం కారణంగా ప్రజలు ఆ పార్టీని  తిరస్కరించారన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్షాల డొల్లతనం బయటపడిందని, ప్రస్తుతం కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు ఎవరో తెలియని అయోమయ పరిస్థితి ఆ పార్టీలో ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేల రాజీనామాలు.. ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయన్నారు.

Latest Updates