ముందు కుస్తీ..తర్వాత దోస్తీ చేసుకోవడం టీఆర్ఎస్, ఎంఐఎంకు అలవాటే

ఎంఐఎంతో పొత్తు లేదని  టీఆర్ఎస్, గులాబీ పార్టీతో పొత్తు లేదని ఎంఐఎం…గ్రేటర్ ప్రచారంలో పరస్పరం విమర్శలు  చేసుకుంటున్నాయి. రెండు పార్టీల డ్రామాగా కొట్టిపడేస్తున్నారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య  అధికారికంగా పొత్తుల్లేకపోయినా…అవగాహనతో వ్యవహారాలు నడిపించాయి.  కీలక ఇష్యూస్ ఉన్న సమయంలో అసదుద్దీన్ నేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్ లో చర్చలు జరిపిన సందర్భాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తాము, టీఆర్ఎస్ కలిసి క్లీన్ స్వీప్ చేస్తామని ఓవైసీ బ్రదర్స్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు పొత్తుల్లేవని రెండు పార్టీల నేతలు చెప్తున్నారు. ముందు కుస్తీ..తర్వాత దోస్తీ చేసుకోవడం టీఆర్ఎస్, ఎంఐఎంకు అలవాటేనని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు.

Latest Updates