మా పార్టీని మరిచిపోతే పుట్టగతులుండవు : శ్రీనివాస్ గౌడ్

trs-minister-srinivas-goud-warning-public

రాష్ట్రంలో పెంచిన ఆసరా పెన్షన్ల చెక్కులు, ప్రొసీడింగ్స్ పంపిణీ ప్రారంభమైంది. అధికార పార్టీ నేతలు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. పింఛన్ ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ ఇచ్చిన తమ పార్టీని మరిచిపోతే పుట్టగతులుండవంటూ పబ్లిక్ కు వార్నింగ్ ఇచ్చారు. TRSను మరిచి పోతరా అంటూ పదేపదే చెప్పారు. తలకిందులు తపస్సు చేసినా మరేపార్టీ అధికారంలోకి రాదన్న ఆయన.. మరో పదిహేనేళ్లు టీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉంటుందన్నారు. కార్యకర్తలు, నేతలు కూడా పార్టీకి ఇబ్బందులు కలిగే పని చేయొద్దని హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Latest Updates