నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్

టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు కరోనా పాజిటివ్ అని తేలింది.  స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన.. హైదరాబాద్ ‌లోని ఓ హాస్పిట‌ల్ లో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ హాస్పిట‌ల్ లోనే ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ‌కి కరోనా పాజిటివ్ వచ్చిన విష‌యం తెలిసిందే. అయితే జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. వారిని కలిసిన అధికారులు, పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు.

Latest Updates