లోకల్ లీడర్ కు ఎంట్రీ.. పద్మా దేవెందర్ రెడ్డికి నో ఎంట్రీ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆధ్వార్యంలో శనివారం ప్రగతి భవన్ లో నరసింహన్ కు వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు VIPలను మాత్రమే ఆహ్వానించారు. అయితే అక్కడికి వెళ్లిన మాజీ అసెంబ్లీ డిఫ్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్ రెడ్డిని అనుమతించలేదు. మంత్రులు, IPS, IAS అధికారులకు మాత్రమే ఎంట్రీ ఉందని సంబంధిత అధికారులు చెప్పడంతో..పద్మా దేవెందర్ రెడ్డి తిరిగి ఇంటికి వెళ్లి పోయారు.

ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి TRS నేత తలసాని సాయి కిరణ్ వెళ్లడం చర్చనీయాంశమైంది. 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మాదేవెందర్ రెడ్డి.. 2001లో TRS పార్టీ ప్లోర్ లీడర్ గా కూడా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా అసెంబ్లీ డిఫ్యూటీ స్పీకర్ గా పని చేశారు. అలాంటిది.. ఓ చిన్న TRS లీడర్ కు ఇచ్చిన విలువ.. పద్మాదేవెందర్ రెడ్డికి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Latest Updates