బీజేపీ క్యాండిడేట్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి!

మైలార్​దేవ్​పల్లి డివిజన్​లో ఆందోళన

ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని డీకే అరుణ డిమాండ్​

రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి డివిజన్​లో బీజేపీ క్యాండిడేట్​ తోకల శ్రీనివాస్​రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్​ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్, ఇతర నేతలు దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డివిజన్​ పరిధిలోని హౌజింగ్​బోర్డు, పరిసర ప్రాంతాల్లో టీఆర్ఎస్​ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బీజేపీ క్యాండిడేట్, కార్యకర్తలు వెళ్లి అడ్డుకున్నారు. ఈ సమయంలో గొడవ జరిగింది. టీఆర్ఎస్​ నేతలు దీనిపై ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు. కాసేపటికే ఎమ్మెల్యే, మరో 200 మంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అలా వచ్చినవాళ్లు వచ్చినట్టుగా బీజేపీ క్యాండిడేట్, కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో తనకు, కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయని బీజేపీ క్యాండిడేట్​ తోకల శ్రీనివాస్​రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్​ నేతలు డబ్బు పంచుతుండటంపై తాము పోలీసులకు సమాచారం ఇచ్చామని.. అక్కడికి వచ్చిన ఎస్సై మీద కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ మైలార్​దేవ్​పల్లి పోలీస్​స్టేషన్​ఎదుట ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ వైస్ ​ప్రెసిడెంట్​డీకే అరుణ అక్కడికి చేరుకున్నారు. టీఆర్ఎస్​ ఎమ్మెల్యే, అనుచరులు దాడులకు దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలింగ్​ ప్రశాంతంగా సాగాలంటే.. ఎమ్మెల్యేను, అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అనుచరులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా.. ఈఘటనపై డీసీపీ కార్యాలయంలో కంప్లైంట్​ చేశామని బీజేపీ నేత స్వామిగౌడ్ తెలిపారు.

For More News..

ఎల్​ఆర్​ఎస్​ స్పీడ్​.. గ్రేటర్​ ప్రజలపైనే రూ. 2 వేల కోట్లకుపైగా భారం

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌‌.. అప్పులు తీర్చేందుకు తల్లి, చెల్లి హత్య?

Latest Updates