కలాలు, గళాలు మౌనంగా ఉంటే చాలా ప్రమాదకరం

మహబూబాబాద్: కలాలు, గళాలు మౌనంగా ఉంటే క్యాన్సర్ కంటే ప్రమాదమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత తనకు చాలా మంది దూరమయ్యారని రసమయి చెప్పారు. లిమిటెడ్ కంపెనీల్లో పని చేసేటప్పుడు ఆ కంపెనీ పరిధుల్లోనే బతకాల్సి ఉంటుందని.. ప్రస్తుతం తాను కూడా ప్రభుత్వాన్ని ఓ లిమిటెడ్ కంపెనీలా భావించి ఉంటున్నానని చెప్పారు. మహబూబాబాదులో నిర్వహించిన ప్రముఖ రచయిత జయరాజు తల్లి సంతాప సభలో రసమయి పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పాటలు మారిపోయాయని, వ్యక్తుల చుట్టూ పాటలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందన్నారు. గోరేటి వెంకన్నకు వచ్చినట్లే రాజకీయంగా జయరాజ్‌‌కూ మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి కూడా పాల్గొన్నారు.

 

Latest Updates