రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలె: ఎమ్మెల్సీ బోడగుంటి

  • ట్రాన్స్ కో సీఎండీని కాల్చినా తప్పులేదంటారా?
  •  పోలీసులు సుమోటోగా కేసు పెట్టాలె: బోడకుంటి వెంకటేశ్వర్లు 

హైద్రాబాద్, వెలుగు: ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావుపై అభ్యంతరకరంగా కామెంట్లు చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిపై పోలీసులు సుమోటోగా కేసు పెట్టి అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు లేవంటూ ప్రభాకర్​రావు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఆయనను అమరవీరుల స్తూపం వద్ద కాల్చినా తప్పు లేదని రేవంత్ రెడ్డి కామెంట్​చేయడాన్ని వెంకటేశ్వర్లు తప్పుపట్టారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి.. రాజకీయాలకు పనికి రారని, చీకటి సెటిల్ మెంట్లు చేసుకోడానికే సరిపోతారని విమర్శించారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభాకర్ రావు విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా మార్చారని అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోడానికే రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ప్రభాకర్ రావు కాంగ్రెస్ హయాంలో కూడా విద్యుత్ శాఖలో పనిచేశారన్న విషయం మరిచిపోరాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Latest Updates