మెట్రో ఓపెనింగ్ పై కిషన్ రెడ్డిది అనవసర రాద్ధాంతం : కర్నె

JBS-MGBS మెట్రో ఓపెనింగ్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనవసరం రాద్ధాంతం చేస్తున్నారన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రెడ్డి. కిషన్ రెడ్డి ఢిల్లీ నాయకుడిలా కాదు..గల్లీ నాయకుడిలా మాట్లాడుతున్నారన్నారు. మెట్రోకి నిధులు అడగవద్దు అనే వ్యాఖ్యలను కిషన్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై ప్రేమ ఉంటే కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని, రావాల్సిన నిధులు ఇప్పించాలన్నారు.

 

Latest Updates