అధికార పార్టీ డబ్బు పంపిణీ : కొట్టుకున్న TRS, కాంగ్రెస్ కార్యకర్తలు

మంచిర్యాల జిల్లా  జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందారం గ్రామంలో టీఆర్ఎస్ కు చెందిన నేతలు డబ్బులు పంచుతుండగా..కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మద్య వాగ్వాదం జరిగింది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై విజేందర్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పలువురిపై చేయి చేసుకున్నారు. వివాదం ఇరువర్గాల వివాదం ఘర్షణకు దారి తీసింది. రెండు పార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కాంగ్రెస్ నాయకులను తెల్ల వారుజామున అరెస్ట్ చేసి, ఉదయం 8 గంటలకు విడుదల చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. డబ్బులు పంచుతున్న అధికార పార్టీ కార్యకర్తలను వదిలేసి తమను పోలీసులు పట్టుకోవడమేంటని నిరసన వ్యక్తం చేశారు.

Latest Updates