అమిత్‌‌‌‌షాతో డీఎస్‌‌‌‌ భేటీ

న్యూఢిల్లీ, వెలుగు:  టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌‌‌‌  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన డీఎస్‌‌‌‌.. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అమిత్‌‌‌‌షాతో భేటీ అయ్యారు. చాలా కాలంగా బీజేపీ సీనియర్​ నేతలు రాజ్​నాథ్​, అరుణ్​జైట్లీతో పాటు అమిత్​ షాతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. తన కుమారుడు, నిజామాబాద్​ బీజేపీ ఎంపీ అర్వింద్​కు అన్నిరకాలుగా సహకారం అందిస్తున్నందుకు అమిత్​ షాకు డీఎస్​ కృతజ్ఞతలు తెలిపినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా టీఆర్​ఎస్ తో అంటీముట్టనట్లు ఉంటున్న ఆయన ఇప్పటికిప్పుడు పార్టీ మారే అవకాశాలు లేవని సమాచారం. డీఎస్​ రాజ్యసభ పదవీ కాలం 2022 మార్చి వరకు ఉంది.

Latest Updates