అందరికీ హైదరాబాదీ బిర్యానీ తినిపించా: ఎంపీ జితేందర్ రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా తమ రాష్ట్ర హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తున్నామని లోక్ సభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి అన్నారు. 16వ లోక్ సభ చివరి రోజున ఆయన మాట్లాడుతూ.. బైసన్ పోలో గ్రౌండ్ ను రాష్ట్రానికి అప్పగించాలని మరోసారి కేంద్రాన్ని కోరారు. ఎన్నో ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత లోక్ సభలోనూ మొదటి రోజునుంచే పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు ఎంపీ జితేందర్ రెడ్డి. పార్లమెంట్ ఫుడ్ కమిటీ ఛైర్మన్ గా అందరికీ హైదరాబాదీ బిర్యానీ తినిపించానని చెప్పారు.

 

Latest Updates