రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రేస్ లో ఉన్నా..రాష్ట్రం కోసం పార్ల‌మెంట్ లో ఫైట్ చేస్తాం

రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళ పూర్తి అవుతున్నా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేద‌ని టీఆర్ఎస్ రాజ్య‌స‌భ‌స‌భ్యులు కేకే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేలా పార్టీ ఎంపీలు పార్ల‌మెంట్ వేదిక‌గా గ‌ళం ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నార‌ని అన్నారు.

రాష్ట్రం ఏర్ప‌డి ఏళ్లు గ‌డుస్తున్న ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని కేంద్ర ప్రభుత్వానికి వందల లేఖలు రాసినా స్పందన లేదన్నారు.

నీటి సమస్యల పై కేంద్రానికి ఎన్ని లేఖలు రాసినా ఏడేళ్లు గడిచినా సమస్యను కేంద్రం ప‌రిష్క‌రించ‌లేదు. కేంద్రం ప్రవర్తన వల్ల రాష్ట్రాలు – ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నారు. యూరియా 1లక్షకు పైగా మెట్రిక్ టన్నులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది.

విద్యుత్ బిల్లులో ప్రతీ అంశం రాష్ట్రాల హక్కులను కోల్పోయే విధంగా ఉన్నాయి. 30లక్షల మోటార్లు తెలంగాణ లో ఉన్నాయి. మోటర్లకు మీటర్లు పెడతాం అంటే టి- బీజేపీ ఒప్పుకుంటుందా..? అని ప్ర‌శ్నించారు.

తెలంగాణ ప్రజలకు మేము ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. జాతీయ రహదారుల పై గడ్క‌రీ హామీలు మాటలకే పరిమితం అవుతున్నాయ‌న్నారు. 3వేల 1వంద కిలోమీటర్లు హామీ ఇస్తే –1వెయ్యి మాత్రమే ఇచ్చారు ఇంకా వెయ్యికి పైగా బకాయి ఉన్నాయ‌న్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంకా 22 నవోదయ స్కూల్స్ రావాల్సి ఉంది.

జీఎస్టీ రాకముందు వ్యాట్ కలెక్షన్ 24శాతం ఉన్నాయ‌ని, జీఎస్టీ బకాయిలు తెలంగాణ రాష్ట్రానికి 5వేల 7వందల కోట్లు ఉన్నాయి. మొత్తం 8వేల కోట్లకు పైగా తెలంగాణ జీఎస్టీ వల్ల నష్టపోతోంది.వరంగల్ టెక్స్ టైల్స్ పై ఐటీఐ ఆర్ పై కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. .

ఇప్పటి వరకు చాలా విషయాల్లో బీజేపీ కి సపోర్ట్ చేశామ‌న్న కేకే..తాను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రేస్ లో ఉన్నా..ప్రతి పక్షం తరుపున నన్ను పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ అడిగింది. చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక అనేది రాజకీయాలకు అతీతంగా జరుగుతుంద‌ని టీఆర్ఎస్ రాజ్య‌స‌భ‌స‌భ్యులు కేకే అన్నారు.

Latest Updates