బడ్జెట్ లో బీజేపీ పాలిత రాష్ట్రాలకే పెద్దపీట

కేంద్రం బడ్జెట్ లో బీజేపీ పాలిత రాష్ట్రాలకే పెద్దపీట వేసిందన్నారు టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల మీద కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. తెలంగాణకు 22 సంస్థల ఏర్పాట్లపై ప్రతిపాదనలు పంపినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఇంటింటికి నీరు ఇస్తామని కేంద్రం ఇపుడు చెబుతుంది కానీ తెలంగాణలో ఎప్పటి నుంచో ఇంటింటికి నీరు అనే పథకం అమల్లో ఉందన్నారు. నేషనల్  హైవే, రైల్వే లైన్, విద్యా సంస్థలకు తగిన న్యాయం చేయలేదన్నారు. పురాతన కట్టడాలు, మ్యూజియాలు, దేవాలయాలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నా ఒక్కదానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.

see more news

బడ్జెట్‌తో దేశ ప్రజలకు ఎలాంటి లాభం లేదు

బడ్జెట్‌లో ఢిల్లీపై సవతి తల్లి ప్రేమ

Latest Updates