ప్రజల్లో ఉన్నందుకే మా ఎమ్మెల్యేలకు కరోనా

హైదరాబాద్, వెలుగు: ప్రతిరోజూ ప్రజల్లో ఉండడం వల్లే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని ఆ పార్టీ​ ఎంపీ రంజిత్​ రెడ్డి చెప్పారు. కరోనా విషయంలో రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసుల్లేవా అని నిలదీశారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో ఎమ్మెల్యే జీవన్​రెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్​ రూల్స్ ప్రకారమే నడుచుకుంటోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​మెచ్చుకుంటుంటే, బీజేపీ చీఫ్​ జేపీ నడ్డా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. పీయూసీ చైర్మన్​ జీవన్​ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యపై బీజేపీ నేతలు సోషల్​ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ లో ఎక్కువ కేసులున్నాయని నడ్డా అబద్ధం చెప్పారని విమర్శించారు. గుజరాత్ లో 27 వేల కేసులు నమోదయ్యాయి.. వీటిపై మోడీని నడ్డా ప్రశ్నిస్తారా? అని అడిగారు. లాక్ డౌన్ విషయాన్ని ముందు చెప్పకుండా వలస కార్మికుల ఉసురు తీసుకున్నది నిజం కాదా ? అని విమర్శించారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ లో మోడీ వ్యవసాయానికి ఏం చేశారని జీవన్​ రెడ్డి ప్రశ్నించారు.

కరోనా టైమ్ లో ఎమ్మెల్యేలకు గిప్ట్ కూపన్లు

Latest Updates