భువనగిరిలో TRS విజయం

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. భువనగిరి మున్సిపాలిటీలో TRS గెలిచింది. భువనగిరిలో వార్డులకు 15 TRS, 12 కాంగ్రెస్, 7 BJP ఇతరులు 1 గెలిచారు. ఆలేరు, పోచంపల్లిలోనూ TRS విన్ అయ్యింది.

జనగాం మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మొత్తం 30 స్థానాల్లో టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 10, బీజేపీ 4, ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో గెలిచారు. క్యాతనపల్లి మున్సిపాలిటిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ 22 స్థానాలకు గాను 19 స్థానాల్లో గెలుపొందింది టీఆర్ఎస్. ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ ఒక్కొక్క స్థానంలో గెలుపొందాయి. పోచారం మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఇక్కడ 18 స్థానాలకు గాను 12 స్థానాల్లో కారు దూసుకుపోయింది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కోక్క స్థానంలో గెలవగా.. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచారు. గద్వాల మున్సిపాలిటిని టీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం 37 స్థానాల్లో టీఆర్ఎస్ 19, కాంగ్రెస్ 3, బీజేపీ 10, ఎంఐఎం 1, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు.

Latest Updates