నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ విజయం

నిజామాబాద్:  ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఊహించినట్లే టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ తరపున అభ్యర్ధిగా బరిలోకి దిగిన కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొత్తం 823  ఓట్లకు గాను 728 ఓట్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత కు పడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నామమాత్ర ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని చివరి నిమిషం వరకు ఆపరేషన్ ఆకర్స్ పేరుతో.. ఇతర పార్టీల నేతలకు గాలం వేయడంతో కొద్దిగా ఉత్కంఠ రేపినా ఫలితం ఊహించినట్లే వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొత్తం 823 ఓట్లకు కు గాను.. టీఆరెస్ కు 728 ఓట్లు వచ్చాయి. బిజెపి 56 ఓట్లు దక్కించుకోగా కాంగ్రెస్ కు 29 ఓట్లు పడ్డాయి. మరో 10 ఓట్లు చెల్లనివి పడ్డాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన వెంటనే ఏకపక్షంగా ఓట్లు పడడంతో కౌంటింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు ఉత్సాహంగా కనిపించారు. మొదటి రౌండ్లలో 600 ఓట్లు లెక్కించగా టీఆర్ఎస్ కు 532, బిజెపి 39, కాంగ్రెస్ 22,  చెల్లనివి 7 ఓట్లు పడ్డాయి. ఇక మిగిలిన 231 ఓట్లు లెక్కించకున్నా ఫలితం తేలిపోవడంతో.. రెండో రౌండ్ తర్వాత  ప్రకటన లాంఛనంగా మారింది. తమ పార్టీ అభ్యర్థి కవిత ఘన విజయం సాధించడంతో టీఆర్ఎస్ నేతలు సంతోషంతో ఒకర్నొకరు అభినందించుకున్నారు.

 

 

Latest Updates