బీజేపీ శ్రేణులంతా కలసి వచ్చినా ఎదుర్కోవడానికి రెడీ

హైదరాబాద్: తెలంగాణలో చిచ్చు పెట్టాలని అనుకుంటే ఎవరి జేజమ్మ వల్ల కూడా సాధ్యం కాదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. బీజేపీ నేతలపై గువ్వల ఫైర్ అయ్యారు. బండి సంజయ్ పిచ్చి పట్టిన కుక్కలా అరుస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలను కులాల వారిగా చీల్చడానికి బండికి సిగ్గుండాలన్నారు.

‘బీజేపీ నేతల్ని కంట్రోల్ చేయడం మంత్రి పదవి ఒరగబెడుతున్న కిషన్ రెడ్డి వల్ల కూడా అవ్వడం లేదు. 2023 కాదు.. 2048 వచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం పగటి కలే. తెలంగాణలో బీజేపీ బలం ఎంత? ఆ పార్టీకి కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు? మహిళల గురించి మాట్లాడేందుకు బీజేపీ ఇన్‌‌చార్జ్ తరుణ్‌ చుగ్‌కు సిగ్గుండాలి. యూపీలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుతున్నాయి. అలర్లు సృష్టించడమే మీ లక్ష్యమైతే రండి. మేం సిద్ధంగా ఉన్నాం. మోడీ మోచేతి నీళ్లు తాగడం అలవాటు పడి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బండి సంజయ్‌‌ను ఎంపీగా గుర్తించం. ఆయనను కరీంనగర్ కార్పొరేటర్‌‌గానే భావిస్తున్నాం. మీరు దాడులకు దిగితే కాచుకోవడానికి మేమూ రెడీ. దేశంలోని బీజేపీ శ్రేణులంతా కలసి వచ్చినా ఎదుర్కొంటాం’ అని గువ్వల చెప్పారు.

Latest Updates