టీఆర్ఎస్ కు 14 ఎంపీ సీట్లు.. వీడీపీ సర్వే

TRS will win 14 MP seats
  • టీఆర్ ఎస్ కు 14, కాంగ్రెస్ కు 2 స్థానాలు
  • రాష్ట్రం లో ‘లోక్ సభ’ ఫలితాలపై వీడీపీ అసోసియేట్స్​ అంచనా
  • ఏపీలో వైఎస్సార్సీపీకి 21, టీడీపీకి 4 సీట్లు

TRS will win 14 MP seatsహైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ 14 సీట్లను కైవసం చేసుకుంటుందని వీడీపీ అసోసియేట్స్ సంస్థ తాజా సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల, మజ్లిస్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధిస్తాయని పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏమిటన్న కోణంలో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ ఫలితాలను
బుధవారం ట్విటర్ లో పోస్టు చేసింది. తెలంగాణలో బీజేపీ తన సిట్టింగ్ సీటైన సికింద్రాబాద్ ను కోల్పోతుందని తెలిపింది. టీఆర్ఎస్ కు 42.85శాతం, కాంగ్రెస్ కు 34.2శాతం, బీజేపీకి 12.10శాతం, మజ్లిస్ కు 4శాతం, ఇతరులకు 6.85శాతం ఓట్లు వస్తాయని వివరించింది.

ఏపీలో టీడీపీకి ఎదురుదెబ్బ

TRS will win 14 MP seats, ycp get 21ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీకి గట్టిదెబ్బ తగలనుందని అంచనా వేసింది. అక్కడి మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో టీడీపీ 4 చోట్ల మాత్రమే గెలుస్తుందని, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలను కైవసం చేసుకుంటుందని వీడీపీ అసోసియేట్స్ తన సర్వేలో తేల్చింది. వైఎస్సార్సీపీకి 45 శాతం,
టీడీపీకి 37.2 శాతం, బీజేపీకి 7.13 శాతం, జనసేనకు 5.9 శాతం, కాంగ్రెస్ కు 2.2 శాతం,
సీపీఎంకు 0.24 శాతం, సీపీఐకి 0.2 శాతం, ఇతరులకు 2.13శాతం ఓట్లు వస్తాయని వివరించింది.

బెంగాల్ లో బీజేపీకి 15 సీట్లు

పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీకి 27, బీజేపీకి 15 సీట్లు వస్తాయని వీడీపీ అసోసియేట్స్ సర్వేలో తేలింది. అక్కడ మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉండగా.. 2014 ఎన్నికల్లో టీఎంసీ 34 చోట్ల, బీజేపీ 2 చోట్ల గెలిచింది. సీబీఐ ఎపిసోడ్ తో బీజేపీకి లాభం చేకూరనుందని తాజా సర్వేను బట్టి తెలుస్తోంది.

Latest Updates