రెండెకరాల స్థలంలో కారు ముగ్గు

సంక్రాంతి సందర్భంగా రెండకరాల స్థలంలో వేసిన కారు ముగ్గు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిరిసిల్ల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లో టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలతో పాటు మంత్రి కేటీఆర్ కు చెందిన ఓ టీమ్ ఈ ముగ్గు ని వేశారు.  డ్రోన్ ల సహాయంతో ఆ ముగ్గు ను లాంగ్ షాట్ నుంచి ఫోటోలను తీసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా వేసిన ఈ ముగ్గు విశేషంగా ఆకర్షిస్తోంది. 200 మంది మహిళలు ఈ ముగ్గును వేశారు. కారు మధ్యలో KCR  అనే అక్షరాలతో  సీఎం కేసీఆర్ పై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో సిరిసిల్ల ను అభివృద్ధి చేయడంతో కారు గుర్తు ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని, అందుకు గుర్తుగా ఈ ముగ్గును వేశామని అక్కడి మహిళలు తెలిపారు.

Latest Updates