కమ్యూనిస్టుల కంచుకోటలో ఎగిరిన గులాబీ జెండా

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు పార్టీ తన జోరును కొనసాగిస్తుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఆధీపత్యం టీఆర్ఎస్ పార్టీదే. కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరొందిన ఖమ్మం జిల్లాలో కూడా టీఆర్ఎస్ పార్టీ తన జెండాను ఎగరేసింది. అదీ కూడా సీపీఎం ముఖ్య నాయకుల స్వగ్రామాల్లో.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం తెల్దారుపల్లిలో టీఆర్ఎస్ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కృష్ణయ్య MPTC గా గెలుపొందాడు. మరో ముఖ్య నాయకుడు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన పోతినేని సుదర్శన్ స్వగ్రామం నారాయణ పురం( బోనకల్ మండలం ) లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థే MPTC గా విజయం సాధించాడు. ఈ రెండు గ్రామాలలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని సీపీఎం.. తాజా రాజకీయ పరిస్థితుల వల్ల ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టారు.

Latest Updates