సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్

TRS Working President KTR Started development works in sircilla district

TRS Working President KTR Started development works in sircilla districtరాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసిన అన్నపూర్ణ పథకం, అక్షయ పాత్రను ప్రారంభించారు. నెహ్రూ నగర్ లో వైకుంఠధామం, ఇందిరా నగర్ లో నిర్మించిన ఇందిరా పార్కు, శాంతి నగర్ లో ఓపెన్ జీమ్ తో పాటు కొన్ని అభివృద్ధి పనులను షురూ చేశారు కేటీఆర్. సాయంత్రం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి శోభయాత్రలో పాల్గొంటారు. తర్వాత సిరిసిల్ల మానేరు నది దగ్గర తడిచెత్త, పొడి చెత్త, బ్యాటరీ వాహనాలను.. బతుకమ్మ ఘాట్ దగ్గర మ్యూజికల్ పౌంటేషన్ ను ప్రారంభిస్తారు కేటీఆర్.

Latest Updates