రెండోసారి మంత్రిగా KTR…

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మంత్రి పదవిని చేపట్టారు. ఆదివారం రాజ్ భవన్ లో కేటీఆర్ చేత గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. వీరు… జులై 24 1976లో జన్మించిన కేటీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. 2009లో మొదటిసారి సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్ ఆ తర్వాత తెలంగాణ కోసం 2010లో రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ వరుసగా సిరిసిల్ల నుంచి గెలుపొందారు. 2014 నుంచి 2018 వరకు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కీలకమైన ఐటీ, మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వీటితో పాటు.. టెక్స్ టైల్, ఎన్ఆర్ఐ అఫైర్స్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు కేటీఆర్.

Latest Updates