TRTపై హైకోర్టు తీర్పు : రెండు భాషల్లోనూ పరీక్ష

ap HIGH COURT_4_2టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్(TRT) పై హైకోర్టు బుధవారం (ఫిబ్రవరి-21)  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. PET పేపర్ ను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పేపర్లు ఇవ్వాలని TSPSC కి ఆదేశాలిచ్చింది. రెండు భాషల్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వాలని కోరుతూ గతంలో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే బుధవారం (ఫిబ్రవరి-21) వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది హైకోర్టు. సవరించిన హాల్‌టికెట్‌లను TSPSC వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశామని తెలిపింది. ఇది వరకే డౌన్ లోడ్ చేసుకున్న అభ్యర్థులు మళ్లీ డౌన్ లోడ్ చేసుకుని.. మారిన పరీక్ష కేంద్రం చూసుకోవాలన్నారు. పరీక్ష వాయిదా పడుతుందనే పుకార్లు నమ్మవద్దని అధికారులు అభ్యర్థులకు సూచించారు. ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్న TRT పరీక్షల కోసం ఫిబ్రవరి-21 మధ్యాహ్నం నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది  TSPSC.

Posted in Uncategorized

Latest Updates