ఉద్యోగాలు భర్తీ చేయడం ఓ రికార్డ్ : TSPSC

తెలంగాణలో అతి తక్కువ రోజుల్లో రికార్డ్ ఉద్యోగాలను కల్పించడం సంతోషంగా ఉందన్నారు TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి. శనివారం TRT  ఇంగ్లీష్ మీడియం SGT ఫలితాలను విడుదల చేసింది TSPSC. ఈ ఫలితాల్లో 909 పోస్టులకు 843 మంది సెలక్ట్ అయినట్లు తెలిపింది. ఫలితాల విడుదల సందర్భంగా ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేశారు TSPSC ఛైర్మన్.

అక్టోబర్ 11న 3 వేల 786 TRT-SGT  తెలుగు మీడియం పోస్టులను భర్తీ చేశామని..శనివారం 843 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. 20 రోజుల్లో 5 వేల పోస్టులను భర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదో రికార్డ్ అని ట్వీట్ చేశారు చక్రపాణి.

Latest Updates