రోడ్డుపై దిగిన హెలికాప్టర్.. ఒకరు మృతి

అమెరికాలో ఓ ట్రక్కు హెలికాప్టర్ ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ట్రక్కు హెలికాప్టర్ ను ఢీ కొట్టడమేంటనుకుంటున్నారా? అవును.. ఆకాశంలో వెళ్లాల్సిన హెలికాప్టర్ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల రోడ్డుపై ల్యాండ్ అయ్యింది. అలా ల్యాండ్ అయిన హెలికాప్టర్ ను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో ట్రక్కు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది.

హెలికాప్టర్ గాల్లోకి లేచిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది.  వెంటనే ఈ విషయాన్ని గమనించిన పైలట్  ఆ హెలికాప్టర్ ను పామ్ నదీతీరం దగ్గరలో  ఉన్న నేషనల్ హైవేపై ల్యాండ్ చేశాడు. ఆ హెలికాప్టర్ ను రోడ్డు పక్కకి నడిపించేటప్పుడు ఓ ట్రక్కు వేగంగా వచ్చి హెలికాప్టర్ ను ఢీ కొట్టింది. దీంతో హెలికాప్టర్ రోటార్ బ్లేడ్లు ట్రక్కులోకి చొచ్చుకుని పోవడంతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో కాసేపు ఆ హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Latest Updates