రాజస్థాన్ లో భారీ వర్షాలు: కొట్టుకుపోయిన లారీ

వరద ధాటికి ఓ లారీ బ్రిడ్జిపై నుంచి నదిలోకి జారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని, దుంగార్పూర్ సిటీలో జరిగింది. కొందరు స్కూల్ స్టుడెంట్స్ తమ ఊరికి చేరకోవడానికి అటువైపుగా వెళ్తున్న లారీని లిప్ట్ అడిగి ఎక్కారు. అయితే లారీ రామ్ పురా బ్రిడ్జ్ కు చేరుకునే సరికి రోడ్డుపై నుంచి వరద  ఉదృతంగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహాన్ని దాటే క్రమంలో… లారీ నదిలోపలికి జారింది. అందులో ఉన్న స్టుడెంట్స్ హాహా కారాలు చేయడంతో స్థానికులు విద్యార్థులను రక్షించారు. విద్యార్థులు మొత్తం 16మంది ఉన్నట్లు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Latest Updates