టారిఫ్​ పెంపును ఒప్పుకోం: ట్రంప్‌‌

తమ ఉత్పత్తులపై కొన్నేళ్లుగా ఇండియా టారిఫ్ ​పెంచుతూ వస్తోందని అమెరికా ప్రెసిడెంట్​డొనాల్డ్​ట్రంప్​ఆరోపించారు. ఇది తమకు ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ ​చేశారు. జీ 20 సదస్సుకు ముందు ప్రధాని నరేంద్ర మోడీతో ఈ విషయంపై చర్చించాలకున్నట్టు ట్రంప్​ చెప్పారు. కానీ సదస్సు సందర్భంగా మోడీతో భేటీ అయిన ట్రంప్.. రెండు దేశాల మధ్య నెలకొన్న వ్యాపార వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కామర్స్​ మినిస్టర్ల భేటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మీటింగ్​జరిగిన రోజుల వ్యవధిలోనే ఇండియా తీరును తప్పుబడుతూ ట్రంప్ ​ట్వీట్ ​చేయడం గమనార్హం. ఆల్మండ్, వాల్​నట్స్, పప్పు ధాన్యాలు సహా 28 ఉత్పత్తుల దిగుమతిపై ఇండియా పన్ను పెంచగా ట్రంప్​అభ్యంతరం తెలిపారు.

Latest Updates