చచ్చిపోయిన ‘ట్రంప్-మాక్రన్’ చెట్టు

మొదటి ప్రపంచయుద్ధంలో చేసిన సాయానికి గుర్తుగా ఫ్రాన్స్, అమెరికాకు ఇచ్చిన ఓక్ చెట్టు చచ్చిపోయింది. 2018లో వాషింగ్టన్ పర్యటనకు వచ్చిన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రన్, ట్రంప్ కు ఓక్ చెట్టును బహుమతిగా ఇచ్చారు. దాన్ని ఇద్దరు లీడర్లు కలిసి వైట్ హౌజ్ పెరటిలో పాతారు. ఈ చెట్టుకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. దీన్ని ఫ్రాన్స్ లో ఉన్న తొలి ప్రపంచ యుద్ధ మెమోరియల్ వద్ద పెంచారు. ఈ వార్ లో ఫ్రాన్స్ కు సాయపడేందుకు, అమెరికా సైనికులు వచ్చారు. ఇక్కడ జరిగిన హోరాహోరీ పోరును ‘ది బ్యాటిల్ ఆఫ్ బెల్లెవ్ వుడ్’ అని పిలుస్తారు. దీంతో ఈ చెట్టును పాతేటప్పుడు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. కొన్ని రోజుల తర్వాత చెట్టు ఎండిపోయింది. దీంతో దాన్ని వైట్ హౌజ్ నుంచి తొలగించారు. తాజాగా అది చచ్చిపోయింది.

 

Latest Updates