తాలిబన్లతో చర్చల్లేవ్..తేల్చి చెప్పిన ట్రంప్

వాషింగ్టన్: తాలిబన్​ నేతలతో శాంతి చర్చలు జరపట్లేదని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ తేల్చిచెప్పారు. ఓవైపు చర్చలంటూనే మరోవైపు హింసకు పాల్పడుతున్న తాలిబన్లను నమ్మలేమని అన్నారు. ఆదివారం జరగాల్సిన మీటింగ్​ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. అఫ్గానిస్తాన్​లో దీర్ఘకాలంగాసాగుతున్న యుద్ధాన్ని ఆపేయడంతో పాటు అక్కడ మోహరించిన బలగా ల ఉపసంహరణ దిశగా అమెరికా చర్చలు జరుపుతోంది. దీనిపై ఇటు తాలిబన్​లీడర్లు, అటు అఫ్గాన్​ ప్రెసిడెంట్​తో ట్రంప్​ విడివిడిగా సమావేశం అవుతారని పెంటగాన్​ గతంలో ప్రకటించింది. ఆదివారం ఈ భేటీ జరగాల్సి ఉండగా.. శనివా రం సాయంత్రం ఈ చర్చలకు గుడ్​బై చెబుతున్నట్లు ట్రంప్​ ట్వీట్​ చేశారు. మూడు రోజుల క్రితం కాబూల్​లో తాలిబన్లు బాంబు దాడి జరపడంతో అమెరికన్​ సైనికుడితో పాటు 11 మంది చనిపోయారు. ఈ నేపథ్యం లోనే చర్చలకు ట్రంప్​ నో చెప్పినట్లు  వాషింగ్టన్​ వర్గాలు వెల్లడించాయి.

 

Latest Updates