కశ్మీర్ విషయంలో వేలు పెట్టను : ట్రంప్

భారత్ అభ్యంతరాలతో  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. కశ్మీర్ అంశంలో మధ్య వర్తిత్వం చేయబోనని చెప్పారు.  కశ్మీర్ అంశం తన ఎజెండాలో లేదని ట్రంప్ చెప్పినట్లు అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు.

ఇటీవల పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పర్యటించినప్పుడు కశ్మీర్ పై వివాదాస్పద కామెంట్స్ చేశారు అమెరికన్ ప్రెసిడెంట్. కశ్మీర్ పై మీడియేషన్ చేయాలని ప్రధాని మోడీ, పాక్ ప్రధాని ఖాన్ తనను కోరారని ట్రంప్ చెప్పారు. దీనిపై భారత్ తీవ్రమైన అబ్జెక్షన్ చెప్పింది. కేంద్రప్రభుత్వం ట్రంప్ కామెంట్స్ ను ఖండించింది. కశ్మీర్ విషయంలో మధ్యవర్తుల జోక్యానికి అవకాశమే లేదని.. ఇటీవలే థాయిలాండ్ లోనూ భారత విదేశాంగ మంత్రి.. అమెరికా విదేశాంగ మంత్రికి చెప్పారు. భారత్  తేల్చి చెప్పింది. భారత్ ప్రకటనతో అమెరికా కూడా దిద్దుబాటు చర్యలకు దిగింది. రెండు దేశాలు కోరితేనే కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహిస్తానని మరో ప్రకటన చేశారు ట్రంప్. అయితే ట్రంప్ రెండో ప్రకటనను భారత్ లైట్ తీసుకుంది. దీంతో కశ్మీర్ అంశాన్ని ట్రంప్ వదిలేశారని ఇండియా అంబాసిడర్ హర్థవర్థన్ చెప్పారు.

Latest Updates