ఆసుపత్రి నుండి ట్రంప్‌ డిశ్చార్జ్‌.. వైట్‌ హౌస్‌లోనే ట్రీట్ మెంట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌కు కరోనా సోకడంతో వాల్టర్ రీడ్ ఆస్సత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం, సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఆయన డిశ్చార్జ్ అయ్యారు. తనకిప్పుడు చాలా బాగుందని…కోవిడ్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. కరోనా వైరస్ ప్రజల జీవితాన్ని డామినేట్ చేసేలా చేసుకోవద్దని, మనం అభివృద్ధి చెందామని అన్నారు. తన పాలనలో ఎన్నో గొప్ప గొప్ప ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని.. తనకిప్పుడు 20 సంవత్సరాల వయసు తగ్గిపోయినట్లుందని అన్నారు.

డిశ్చార్జ్ అయి, ఎయిర్ ఫోర్స్ వన్ చాపర్ లో తిరిగి వైట్ హౌస్ చేరుకుంటున్న వీడియోను ట్రంప్ పోస్ట్ చేశారు. ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారన్న క్రమంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరగగా, నాస్ డాక్ 466 పాయింట్లు పెరిగింది. ఈ విషయాన్ని మరో ట్వీట్ లో ప్రస్తావించిన ట్రంప్, ఇది అమెరికాకు గుడ్ న్యూస్ అని.. మన ఉద్యోగాలు మనకే ఉంటాయన్నారు.  ట్రంప్ కు మరో వారం పాటు వైట్ హౌస్ లోనే చికిత్సను అందించాలని డాక్టర్లు నిర్ణయించారు.

 

Latest Updates