మీడియా ముందుకు రాని ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రెస్ మీట్ పెట్టలేదు. కరోనా పేషెంట్లకు డిస్ఇన్స్ఫెక్ట్స్ ను ఎక్కించాలంటూ ఆయన చేసిన కామెంట్లు దుమారం రేపటంతో శనివారం ట్రంప్ మీడియా ముందుకు రాలేదు. కరోనా ఎఫెక్ట్ మొదలైన నాటి నుంచి ట్రంప్ రోజు మీడియా మీట్ ద్వారా వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో పలుమార్లు ఆయన చేసిన కామెంట్లు వివాదస్పదంగా మారాయి. దీంతో ట్రంప్ అడ్వయిజర్స్ మీడియాకు దూరంగా ఉండాలంటూ సూచించారు. డిస్ ఇన్ఫెక్ట్ కామెంట్లను మీడియా వక్రీకరించిందంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మీడియాను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఒకవర్గం మీడియా ఎప్పుడూ నెగిటివ్ కోణంలో ప్రశ్నలు అడిగేందుకు పరిమతమైందంటూ అలాంటి వారున్న చోట రోజు ప్రెస్ మీట్ తో ప్రయోజనం ఏమిటనీ ప్రశ్నించారు. తన విలువైన టైమ్ కేటాయించే స్థాయిలో మీడియా లేదంటూ విమర్శించారు. ” నిజాల్ని వక్రీకరించే ఒక వర్గం మీడియా ఎప్పుడూ వ్యతిరేక ప్రశ్నలే అడుగుతుంటుంది. ఇలాంటి మీడియా ఉన్న చోట్ల ప్రెస్ మీట్లతో ప్రయోజనం లేదు. వారికి రేటింగ్స్ వస్తున్నా ప్రజలకు అబద్దాలను చేరవేస్తున్నారు. అలాంటి వారికి టైమ్ కేటాయించటం వేస్ట్ ” అని ప్రకటించారు. ఐతే కరోనా పై ట్రంప్ చేస్తున్న కామెంట్లపై సొంత పార్టీ నేతలు కూడా అసహనంతో ఉన్నారు.

Latest Updates