తుఫాన్లపై అణుబాంబేద్దాం!.అధికారులతో ట్రంప్‌‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌‌  ఎం చేసినా ఏం మాట్లాడినా సంచలనమే. నోటికెంతొస్తే అంత మాట అనేస్తుంటారు. తాజాగా అలానే ఓ మాట అనేశారట. తుఫాన్లపై అణుబాంబులేసేద్దాం అన్నారట.  అమెరికాపై తుఫాను విరుచుకుపడే లోపు వాటిని అణుబాంబులతో నిర్వీర్యం చేసేద్దామని సూచించారట. నేషనల్‌‌ సెక్యూరిటీ అధికారులతో ఇటీవలి సమావేశంలో తుఫాన్ల గురించి చర్చ వచ్చిందట. తీర ప్రాంతంలో తుఫాన్లు ఏర్పడే టైంలోనే వాటి ప్రభావం తగ్గిపోయేలా అణుబాంబు వేద్దామని ట్రంప్‌‌ చెప్పినట్టు అధికారులంటున్నారు. అయినా 2017లోనే తుఫాన్‌‌పై బాంబేద్దామన్న ప్రతిపాదన వచ్చిందని, అయితే, అణుబాంబు గురించి మాత్రం మాట్లాడలేదని అంటున్నారు. 1950లోనే నాటి ప్రెసిడెంట్‌‌ డ్వైట్ ఐసన్‌‌హోర్ హయాంలో సైంటిస్టులు ఈ ప్రతిపాదనను తెచ్చారని ఓ అధికారి చెప్పారు.  తుఫాన్లపై అణుబాంబు  వేస్తే దాని వల్ల విపరీత పరిణామాలు జరుగుతాయని  నేషనల్‌‌ ఓషియనిక్‌‌ అట్మాస్ఫెరిక్‌‌ అడ్మినిస్టేషన్‌‌ (ఎన్‌‌వోఏఏ) హెచ్చరించింది. అణ్వాయుధాల వల్ల రేడియో ధార్మిక ములకాలు ఆ సముద్రంలోని అలలు, గాలితో కలిసి పోయి భూమిపై ప్రభావం చూపిస్తాయని  ఎన్‌‌వోఏఏ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆ ఆలోచన మానుకోవాలంటున్నారు.

 

Latest Updates