ట్రంప్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను వివాదాస్పద ఆరోపణలు వెంటాడుతున్నాయి. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని..  బలవంతంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడని అమిడోరిస్ అనే మాజీ మోడల్ ఆరోపించారు. అయితే ఇది ఈ మధ్య కాలంలో జరిగింది కాదు. 1997లో న్యూయార్క్ లో యూఎస్ ఓపెన్ టోర్నీ జరుగుతున్న సమయంలో జరిగిందంటోంది మాజీ మోడల్ భామ. అప్పుడు తన వయసు 24 ఏళ్లు కాగా.. ట్రంప్ 51 ఏళ్ల వయసులో ఉండి ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఓ వైపు అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు 25 మంది మహిళలు ట్రంప్ పై ఆరోపణలు చేశారు.

ఎన్నికల సమయంలో రాజకీయ ప్రోద్భలంతోనే నన్న ట్రంప్

తనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రోద్భలంతోనేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. వీరి ఆరోపణల చికాకుల నుండి తప్పించుకునేందుకు ప్రత్యేకంగా న్యాయవాద బృందాన్ని ఏర్పుటు చేసుకున్న ట్రంప్ గతంలో మాదిరిగానే ఓ న్యాయవాది ద్వారా ప్రకటన విడుదల చేశారు. డోరీ చెబుతున్నవన్నీ నమ్మదగినవిగా లేవని.. ఆమెపై లైంగిక దాడి జరిగి ఉంటే కనీస సాక్షాధారాలుండేవని పేర్కొన్నారు. కేవలం రాజకీయ ప్రోద్భలంతోనే చేసినట్లు కనిపిస్తోందని ఖండించారు.

Latest Updates