మైక్రోసాఫ్ట్ తీరు..య‌జ‌మాని ఇల్లు త‌గ‌ల‌బ‌డిపోతుంటే దోచుకున్న‌ట్లుంది

చైనాకు చెందిన వీడియో క్రియేటింగ్ యాప్ టిక్ టాక్ ను అమెరికా కొనుగోలుపై సస్పెన్స్ కొన‌సాగుతుంది.ఇండియా టుడే క‌థ‌నం ప్ర‌కారం.. గ‌తంలో తాము టిక్ టాక్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది మైక్రోసాఫ్ట్.

కొనుగోలుపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఆ భేటీలో టిక్ టాక్ ను కొనుగోలు చేసేందుకు సెప్టెంబ‌ర్ 20వ‌ర‌కు ఉన్న స‌మ‌యం స‌రిపోద‌ని, ఇంకా గ‌డువు పెంచాల‌నే అభిప్రాయ‌న్ని స‌త్య నాదెళ్ల ట్రంప్ కు వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఆ భేటీ త‌రువాత తాజాగా ట్రంప్.. చైనాకు చెందిన టిక్ టాక్ ను అమెరికా కు చెందిన సంస్థ‌లకు అమ్ముకునేలా 45 రోజుల స‌మ‌యం ఇచ్చారు. అంటే ఆ గ‌డువు సెప్టెంబ‌ర్ 20తో ముగియ‌నుంది. కానీ ఆ గ‌డువును 90రోజుల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ టిక్ టాక్ వ‌ల్ల దేశ భ‌ద్ర‌త కు న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంది. అమెరికా కు చెందిన స‌మాచారాన్ని చైనాకు అమ్ముకునే అవ‌కాశం ఉంది. అందుకు సంబంధించిన ఆధారాలు మాదగ్గ‌రున్నాయ‌ని తెలిపారు.

ఈ నిర్ణ‌యంతో బైట్ డ్యాన్స్ కు ఊర‌ట ల‌భించిన‌ట్లైంది. ఇంకా 90రోజుల స‌మ‌యం ఉండ‌డంతో అమెరికాకు చెందిన ప‌లు కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఈ 90రోజుల లోపు టిక్ టాక్ అమెరికా సంస్థ‌లు కొనుగోలు చేయాలి. లేదంటే అమెరికాలో ఇక టిక్ టాక్ అమ్మ‌క‌లాపై నిషేధం విధిస్తారు.

ఇదిలా ఉంటే టిక్ టాక్ ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాప్ట్ సంస్థ ప్రారంభ ధ‌ర కింద కొంత అమౌంట్ ను టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ కు ఇచ్చింది.

ఆ ధ‌ర పై ప్ర‌భుత్వానికి అనుబంధ మీడియా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ క‌థ‌నాల్ని ప్ర‌సారం చేసింది. య‌జ‌మాని ఇల్లు త‌గ‌ల‌బ‌డిపోతుంటే దోచుకున్న తీరుగా ఉంద‌ని మైక్రోసాప్ట్ పై స‌ద‌రు మీడియా సంస్థ త‌న క‌థ‌నం లో హైలెట్ చేసింది.

Latest Updates