కరోనా మృతులకు నివాళిగా మూడు రోజులు సంతాప దినాలు

వాషింగ్టన్ : కరోనా మృతులకు ఘనంగా నివాళి అర్పించాలని అమెరికా నిర్ణయించింది. వారిని స్మరించుకునేలా దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. రానున్న మూడు రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని ట్రంప్ ఆదేశించారు. అన్ని ఫెడరల్ భవనాలు, స్మారక బిల్డింగ్స్ పై జెండా అవనతం చేస్తామంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటికే 95 వేల మంది చనిపోయారు. మరో రెండు రోజుల్లో ఈ సంఖ్య లక్ష కు చేరనుంది. లక్షమంది చనిపోయిన విషాద సంఘటనను స్మరించుకునేందుకు వారికి నివాళిగా ఏదైనా కార్యక్రమం చేపట్టాలని డెమెక్రటిక్ నేతలు కోరారు. దీంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఏటా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను మే చివరి సోమవారం స్మరించుకుంటారు. ఆ రోజు వరకు ఈ సంతాప కార్యక్రమం కొనసాగనుంది.

Latest Updates