కరోనాపై వార్: భారత మెడిసిన్ ను కోరిన ట్రంప్…

కరోనా వైరస్ తో కలిసికట్టుగా పోరాడడానికి భారత్, అమెరికాలు చేతులు కలిపాయి. ఇందుకుగాను శనివారం సాయంత్రం భారత ప్రధాని నరేంధ్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషన జరిగింది. కరోనాతో పోరాడటానికి రెండుదేశాలు తమ పూర్తి బలాలను ఉపయోగిస్తామని ఇద్దరు నాయకులు తెలిపారు. ప్రస్తుతం రెండు దేశాలలో కరోనా అంతకంతకు పెరుగుతుంది. అమెరికాలో శనివారం సాయంత్రానికి 3లక్షల 11వేల కేసులు నమోదు కాగా 8వేల 4వందలమంది చనిపోయారు. భారత్‌లో మూడువేల 72మందికి వైరస్ సోకగా 75మంది మృతి చెందారు.

భారత్ కరోనా చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ ను వాడుతుంది. ఇప్పటికే వీటితో మంచి రిజల్స్ వస్తున్నాయి. అయితే కరోనాను కట్టడిచేయడానికి భారత్ వాడుతున్న మందులను అమెరికాకు అందించాలని ట్రంప్ కోరారు. అయితే ఇప్పటికే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. ఈ విషయాన్ని ట్రంప్ వివరిస్తూ తాను హైడ్రాక్సీక్లోరోక్విన్ అమెరికాకు అందించాల్సిందిగా కోరానని అందుకు మోడీ సీరియస్‌గా పరిశీలిస్తున్నారని అన్నారు.

ట్రంప్, మోడీ సమావేశంలో భారతీయ ఆరోగ్య శాస్త్రంపై, యోగాపై చర్చించారు. ప్రజల ఆరోగ్య, శారీరక, మనసిక వ్యవస్థకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రంప్ అన్నారు. భవిష్యత్తులో అమెరికా యోగాను మరింత సపోర్ట్ చేయనుందని ట్రంప్ తెలిపారు. వీరిరువురి సంభాషనను వైట్ హౌస్, ప్రధాని మోడీ కార్యాలయం దృవీకరిస్తూ ట్వీట్ చేశాయి.

Latest Updates