కమలా హారిస్‌ కన్నా నాకే ఇండియన్స్ మద్ధతు ఎక్కువ

అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న కమలా హారిస్ కన్నా తనకే ఎక్కువమంది భారతీయుల మద్ధతు ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి బిడెన్ అధ్యక్షుడైతే అమెరికాలో ఎవరూ సరక్షితంగా ఉండరని ఆయన అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ యొక్క ఎన్నిక ప్రచారాన్ని న్యూయార్క్ సిటీ పోలీస్ బెనెవోలెంట్ అసోసియేషన్ (NYCPBA) శుక్రవారం ఆమోదించింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్ మరియు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్‌పై మాటల దాడి చేశారు.

‘జో బిడెన్ అధ్యక్షుడైతే అతను వెంటనే అమెరికాలోని ప్రతి పోలీసు విభాగాన్ని తొలగించడానికి చట్టాన్ని ఆమోదిస్తాడు. ఇక కమలా హారిస్ అయితే ఒక అడుగు ముందుకు వేస్తారు. కమలా హారిస్ భారత వారసత్వానికి చెందినది. అయినా కూడా ఆమె కంటే నాకే ఎక్కువ మంది భారతీయుల మద్ధతు ఉంది’ అని ట్రంప్ అన్నారు. జో బిడెన్, కమలా హారిస్ పోలీసులకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన అన్నారు.

‘బిడెన్ మీ గౌరవాన్నితీసివేస్తున్నాడు. మీ గౌరవాన్ని మీరు తిరిగి నవంబర్ 3న పొందుతారు’ అని నేను హామీ ఇస్తున్నాను. ఇటీవలి వారాల్లో పోలీసులను మోసం చేయడానికి బిడెన్ మద్దతు ఇస్తున్నట్లు ట్రంప్ పదేపదే నొక్కిచెప్పారు.

శుక్రవారం జరిగిన NYCPBA సమావేశంలో మాట్లాడిన న్యూయార్క్ నగర మాజీ మేయర్ రుడోల్ఫ్ గియులియాని.. కమలా హారిస్ యొక్క ప్రాసిక్యూటరీ రికార్డుపై దాడి చేశారు. హారిస్ కాలిఫోర్నియా యొక్క అటార్నీ జనరల్‌గా ఉన్నప్పుడు.. ఆమె చిన్న కేసులను మరియు చిన్న వారిని విచారించింది, కానీ ఆమె పెద్ద వ్యక్తులపై విచారణ చేయలేదు అని గియులియాని అన్నారు.

For More News..

హైదరాబాద్ వాసులను హెచ్చరించిన జీహెచ్ఎంసీ కమిషనర్

ప్రగతిభవన్ లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

మంచి జరిగితే తన ఖాతాలో.. చెడు జరిగితే కేంద్రం ఖాతాలో..

Latest Updates