ప్రిన్స్ హ్యారీ భద్రత ఖర్చులు మేం భరించం: ట్రంప్

బ్రిటీష్ రాజవంశ వారసులు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు రాజసౌధాన్ని విడిచివెళ్లారు. అయితే  వారు అమెరికాలో సాధారణ జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారు. ఈ విషయంపై మాట్లాడినే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… బ్రిటన్ అన్నా, బ్రిటీష్ రాణి అన్నా తనకు చాలా గౌరవమని చెప్పారు. వారితో తనకు మంచి స్నేహం ఉందన్నారు. రాచకుటుంబాన్ని వీడిన హ్యారీ, మేఘన్ దంపతులు కెనడాలో నివసిస్తారని విన్నామన్నారు. అయితే ఇప్పుడు వారు కెనడాను వదిలి అమెరికాకు వచ్చారని తెలిపారు. అమెరికాలో వారు సంతోషంగా ఉండొచ్చని… కానీ వారి భద్రత ఖర్చులను అమెరికా భరించదని… ఆ ఖర్చులను వారే భరించాల్సిందిగా స్పష్టం చేశారు ట్రంప్.

Latest Updates