టిక్‌టాక్‌ పై డెడ్ లైన్‌ జారీ చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్ టిక్‌టాక్‌ నిషేధం గడువుపై డెడ్ లైన్ జారీ చేశారు. సెప్టెంబరు 15లోపు పూర్తి చేసుకోవాలని… లేదంటే నిషేధమేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒకసారి గడువు డెడ్ లైన్ పెంచిన ట్రంప్ ఇకపై ఈ గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టిక్‌టాక్‌ను ఒక అమెరికన్ కంపెనికి అమ్ముతారా.. లేదా మూసివేస్తారా తేల్చుకోవాలని ప్రకటించారు. అమెరికా కంపెనీ యాజమాన్యంలోని లేని టిక్‌ టాక్‌ను భద్రతా కారణాల దృష్ట్యా నిషేధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ లేటెస్ట్ ప్రకటనపై మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టిక్‌టాక్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత నెలలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ సెప్టెంబర్ 15వ తేదీని లాస్ట్ గడువుగా విధించారు.

Latest Updates