కరోనాపై జయం మనదే..

కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నం

మనం గెలుస్తం: ట్రంప్‌

కనిపించని శత్రువుతో ప్రపంచం యుద్ధం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మనం తప్పకుండా ఆ ఎనిమీని తరిమికొడతామని, యుద్ధంలో గెలుస్తామని ధీమాగా చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. దేశంలో వైరస్‌ను కట్టడి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎయిర్‌లైన్స్‌ ఇండస్ట్రీకి సాయం చేస్తామని మరోసారి చెప్పారు. ప్రజలంతా ఇండ్లల్లోనే ఉండండని, లివింగ్‌ రూమ్స్‌లో ఎంజాయ్‌ చేయండని యూఎస్‌ సిటిజన్స్‌కు ట్రంప్‌ సూచించారు. ఇంకో 15 రోజుల వరకు ఇండ్లల్లోంచి బయటకు రావొద్దని చెప్పారు. కరోనా సమస్యను త్వరగా పరిష్కరించుకుందామని, మళ్లీ ఎప్పటిలా మన పనిలో మనం నిమగ్నమవుదామని అన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తే త్వరగా ఈ ప్రమాదం నుంచి కోలుకుంటామని, ఎక్కువైనా కొద్దీ  పరిస్థితి చేజారిపోతుందని, మరణాలు ఎక్కువవుతాయని చెప్పారు. అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండాలని యూఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌ సూచించారు. ఇంట్లోని వాళ్లకు ఎవరికైనా పాజిటివ్‌ వస్తే కుటుంబమంతా బయటకు రావొద్దన్నారు.

For More News..

ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు.. మొత్తంగా 13కు చేరిక

నేటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. అయిదు నిమిషాలు లేటైనా ఓకే..

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్​లో మూడు కిలోమీటర్లు షట్​ డౌన్

కరోనాకు భయపడి కేసీఆర్ ఫాంహౌస్‌లో దాక్కున్నారు

Latest Updates