ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది: రియా చక్రవర్తి

  • వీడియో రీలీజ్‌ చేసిన ఆమె తరఫు లాయర్‌‌

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి ఒక వీడియో సందేశాన్ని రిలీజ్‌ చేశారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది ఆమె అన్నారు. ఆమె తరఫు లాయర్‌ శుక్రవారం సాయంత్రం దాన్ని రిలీజ్‌ చేశారు. “ నాకు దేవుడు, న్యావ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. మీడియాలో నా గురించి చాలా భయకరంగా చెప్తున్నారు. ఇది న్యాయపరమైన విషయం కాబట్టి, నా లాయర్‌‌ సూచన మేరకు నేనేమీ మాట్లాడటం లేదు” అని రియా చక్రవర్తి వీడియోలో చెప్పారు. సుశాంత్‌ రాజ్‌పుత్‌ అకౌంట్‌ నుంచి ఒక వ్యక్తికి రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫర్‌‌ కావడంలో రియా పాత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని సుశాంత్‌ తండ్రి కేసు పెట్టారు. దీనిపై విచారణ జరపాటని ఆయన పాట్నా పోలీసులకు కంప్లైంట్‌ చేయగా.. పోలీసులు దానిపై విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ముంబై పోలీసులు కూడా రియాను విచారించారు. కాగా.. ఈ విషయంపై రియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Latest Updates