TSఐపాస్ తో 6వేల ఇండస్ట్రీలకు అనుమతి : కేటీఆర్

KTRహైదరాబాద్ లో ప్రతిష్టాత్మక TS ఐపాస్ వచ్చిన రెండేళ్లలో 6వేల ఇండస్ట్రీలకు అనుమతులిచ్చామన్నారు మంత్రి కేటీఆర్. శుక్రవారం (ఫిబ్రవరి-9) HICCలో క్రెడాయ్ యూత్‌కాన్ 2018 కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారు కేటీఆర్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చామని తెలిపిన ఆయన లక్షా 20వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు వెల్లడించారు. 15 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌లో ప్రారంభమయే ప్రతీ అంతర్జాతీయ సదస్సు విజయవంతమవుతుందన్నారు. యూత్‌కాన్-2018 కూడా సక్సెస్ అవుతదని కేటీఆర్ అన్నారు. రాజకీయాల కంటే ఆర్థికపరమైన అంశాలే కీలకమైనవLR.. రాష్ట్రం ఏర్పడిన మూడున్నరేళ్లలో ఎంతో ప్రగతి సాధించినమన్నారు. స్టార్టప్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచినట్లు చెప్పిన కేటీఆర్.. భారత్‌లో యువశక్తి ఎక్కువగా ఉందన్నారు. దేశాన్ని యువత శాసిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రియాల్టీ రంగాన్ని కేంద్రం ప్రోత్సహించాలని.. వ్యవస్థను మార్చే బాధ్యత యువతదేనన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates