TS ఐసెట్ ఫలితాలు విడుదల

TS-ICET22052018-19 విద్యా సంవత్సరంలో MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ..తెలంగాణ ఐసెట్ 2018 ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం (జూన్-13) ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలోని MBA, MCA కాలేజీలలో సీట్ల భర్తీ కోసం మే నెల 23, 24 తేదీల్లో TS ఐసెట్ 2018 పరీక్షలు నిర్వహించారు.

ఐసెట్ కోసం 61 వెయ్యి 439 మంది రిజిస్టర్ చేసుకోగా..55 వేల 191 మంది హాజరయ్యారని..అందులో 49 వేల 812 మంది హర్హత సాధించినట్లు తెలిపారు. . 15 రోజుల్లో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ సారి ఐసెట్ ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates